Site icon Polytricks.in

బలంగా ఉన్న ‘బలగం’ (సమీక్ష)

రేటింగ్ : ౩.25 /5
బ్యానర్ : దిల్ రాజు ప్రొడక్షన్స్
నిర్మాతలు : హర్షిత్ రెడ్డి , హన్షిత రెడ్డి
డైరెక్టర్ : వేణు టిల్లు
మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్
నటీనటులు : ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ , వేణు టిల్లు, రచ్చ రవి, సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీ ఇతరులు.

‘దిల్ రాజు’ ఓ సినిమాను నిర్మించినా, సమర్పించినా దానికి కమర్షియల్ విలువలు వస్తాయి. ‘బలగం’ సినిమాకు కమర్షియల్ హంగులు వచ్చయి అంటే అతని పేరే కారణం.  అది ఐఎస్ఐ బ్రాండ్ లాంటిది.

అలాగని ఇది పక్తు కమర్షియల్ సినిమా కాదు. హాఫ్ బీట్ కమర్షియల్ సినిమా. ఇలాంటి సహజ సినిమాలు మలయాళం, తమిళ్ లో విరివిగా తీస్తారు. కానీ మన తెలుగులో చాలా తక్కువనే చెప్పాలి. కానీ ఇదో మంచి ప్రయత్నం. ఇలాంటి సినిమాలను ఎక్కడా బోర్ లేకుండా తీయడం మెచ్చుకో దగిన అంశం.

కథ ఏమిటి?

సాయిలు (ప్రియదర్శి) తాత ఏంతో  సరదా మనిషి. అందరితో చలాకీగా ఉంటాడు. అన్ని వ్యాపారాలు చేస్తుంటాడు. ఓ రోజు చనిపోతాడు. గొప్ప ట్విస్ట్ ఏమిటంటే అతను ఊరినిండా అప్పులు చేస్తాడు. ఆ అప్పులు తీర్చేందుకు సాయిలు ముందుకు వస్తాడు. ఆ డబ్బు సంపాదించేందుకు కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. అక్కడినుంచి కథ అనేక మలుపులు తిరుగుతుంది. సినిమా చూస్తే మీరు తప్పక థ్రిల్ ఫీల్ అవుతారు. ఓసారి తప్పక చూడవలసిన సినిమా ఇది.

సాంకేతిక నిపుణుల మాటేమిటి?

ముందుగా దర్శకుడు వేణు టిల్లు గురించి చెప్పుకోవాలి. ఇతను జబర్ధస్ట్ స్టేజి మీద నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇతను దర్శకుడిగా కూడా తన ప్రతిభ చాటుకున్నారు. ఇక నటులల్లో ప్రియదర్శి అంతా తానై సినిమాను నడిపాడు. తెలంగాణ మాండలికాలకు ప్రాణం పోశారు. చిన్న చిన్న హావభావాలతో ఎంతో పరిణతి చూపారు. ఇక నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా ఉన్నంతలో రిచ్ గా తీశారు. అసలు ఇలాంటి హాఫ్ బీట్ సినిమా తీసినందుకు వాళ్ళ ను మెచ్చుకోవాలి. నిర్మాతల సినిమా ఇది. నిర్మాతలకు మంచి అభిరుచి ఉందని రుజువు చేసిన సినిమా.

ప్లస్ లక్షణాలు ఏమిటంటే?

కొత్త పాయింట్ తీసుకున్నారు. స్క్రీన్ ప్లే ఉన్నంతలో బాగుది. ట్విస్ట్ లు ఎక్కడికక్కడ బాగున్నుయి. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా హాయిగా సాగిపోతోంది. కొన్ని సీన్లు కంటతడి పెట్టిస్తే, కొన్ని సీన్లు ఆలోచింపచేస్తాయి. ప్రేక్షకుడు ఎక్కడా అవులించడు. కేమెర పనితనం చాలా బాగుంది. పక్కా తెలంగాణ యాసలో సాగే ఈ సినిమా కళాత్మకంగా ఉంది. ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప సినిమా తెలంగాణ యాసలో, అచ్చమైన తెలంగాణ మాండలికాలతో రాలేదు. ఎక్కడా సినిమాటిక్ తెలంగాణ యాస, పదాలు లేవు. చాలా సినిమాలల్లో దొంగ తెలంగాణ యాస కనిపిస్త్డుంది. తెలుగులో కొన్ని ఉర్దూ పదాలను కలిప్తే  తెలంగాణ యాస వస్తుంది అని ఆంధ్ర రచయితలు భావిసారు. కానీ అది తప్పు. ఈ సినిమా చూసి అసలు సిసలు   తెలంగాణ ఏమిటో వాళ్ళు నేర్చుకోవాలి. ఇది వాళ్లకు ఓ కోలమనం.

మైనస్ లక్షణాలు ఏమిటంటే?

కథ బాగున్నప్పటికీ కొన్ని సీన్లు బోర్ గా ఉన్నాయి. చెప్పిందే పడే పడే చెప్పాడు దర్శకుడు. కొన్ని చోట్ల డ్రామా నత్త నడకన నడుస్తుంది. ఆర్ ఆర్ చాలా బలహీనంగా ఉంది. పక్కా తెలంగాణాలో మొత్తం సినిమా తీయడం మంచి ప్రయత్నమే. కానీ పక్కనే ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉందని మరువొద్దు. చాలా పదాలు వాళ్ళకు అర్థం కావు. ఇలాంటి సినిమాలకు మాటలు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇక తప్పదు అనుకున్నప్పుడే మాటలు రాయాలి. మిగతాది అంతా నటనతో చెప్పించాలి, చూపించాలి. చెవులకు పని తక్కువగా కల్పించాలి. దర్శకుడు ఈ లాజిక్ మరిచారు అనిపిస్తోంది. మాటలు ఎక్కువ ఉండటంతో తమిళ్ సినిమా వాసన కొడుతుంది.

Exit mobile version