Site icon Polytricks.in

టీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ – తెరవెనక హరీష్ రావు..?

ఆంధ్రప్రదేశ్ కులాలకు పెద్దపీట వేస్తే తెలంగాణ మతాలకు పెద్ద పీట వేయడం అనాదిగా వస్తున్నా ఆచారం. ఆంధ్రప్రదేశ్ లోని కులాల వైరస్ ఇప్పుడు తెలంగాణకు కూడా క్రమంగా సోకుతోంది. దీనికి చక్కటి నిదర్శనంగా తెలంగాణంలో టిఆర్ఎస్ అనే పేరుతో కొత్త పార్టీ పుట్టబోతోంది. వెలమ సామజిక వర్గానికి చెందిన కొందరు రాజకీయవేత్తలు కలిసి ఈ కొత్త పార్టీ పెట్టడానికి గతకొన్ని రోజులుగా  కృషి చేస్తున్నారు. ఇది చాప కింద నీరులా బిఆర్ఎస్ కొంప ముంచేలా ఉంది. ఈ కొత్త పార్టీ పేరు ‘తెలంగాణ రాజ్య సమితి’ లేదా ‘తెలంగాణ రైతు సమితి’ అని ఖరారు చేసే అవకశం ఉంది. ఇప్పటికే ఈ పేరును రిజిస్టర్ చేసినట్లు తెలిసింది. అయితే వాళ్ళ పేర్లు కావాలనే దాచారు.

దీనికి అసలు కారణం కెసిఆర్. ఈ మధ్య కెసిఆర్ తాను స్తాపించిన టిఆర్ఎస్ ని కాస్తా బిఆర్ఎస్ గా మర్చి జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టారు. అప్పటినుంచి టిఆర్ఎస్ లో కుటుంబ పోరు మొదలయ్యింది. కెసిఆర్ ముఖ్య మంత్రిగా రాజీనామా చేస్తే కాబోయే కొత్త ముఖ్య మంత్రి కెటిఆర్ అని అందరికీ తెలిసిందే. కానీ ఇది అటు కవితకు, ఇటు హరీష్ రావుకు మిగుడు పడడం లేదు.

కెసిఆర్ రాజీనామా చేసిన తర్వాత తనను సిఎం చేయాలనీ కవిత ఎప్పటినుంచో కెసిఆర్ ని పోరుపెడుతోంది. ఇక్కడ కెసిఆర్ కరుణా నిధి ఫార్ములాను ఎప్పటినుంచో నమ్ముకున్నాడు.

తమిళనాడు ముఖ్య మంత్రి కూడా తన కొడుకు స్టాలిన్ కు తమిళనాడు రాజకీయాల్లో పెద్ద పీట వేసి, కూతురు కనిమోలిని ఎంపి చేసి న్యూ ఢిల్లీ కి పంపి కుటుంబ పోరు తగ్గించుకున్నారు. కెసిఆర్ కూడా ఇదే తరహాలో మొదటి నుంచి కవితను న్యూ ఢిల్లీ రాజకీయాలకే పరిమితం చేశారు. ఆమె ఎంపి గా ఓడిపోయిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లోకి గత్యంతరం లేక తీసుకున్నారు. కానీ ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఆమె గురించి కెసిఆర్ కు బాగా తెలుసు. ఆమెకు మంత్రి పదవి ఇస్తే ఇక్కడే పాతుకుపోయి సిఎం పదవికి ఎసరు పెడుతుంది అని బాగా తెలుసు. అందుకే ఆమెను వీలైంత దూరంగా ఉంచారు. అతని గురి మొదటినుంచి కెటిఆర్ మీదే ఉంది.

కానీ అప్పటించి ఇప్పటివరకు బిఆర్ఎస్ లో హరీష్ రావు పాత్ర చాలా కీలకం. కెటిఆర్ కి సమానమైన స్టాయిలో ఉన్నారు. ఆ మాటకొస్తే కెసిఆర్ కు కెటిఆర్, హరీష్ రావు ఇద్దరు ఆయనకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. ఇద్దరిలో ఎవరిని వదులుకున్న చావు దెబ్బ తప్పాడు.

కానీ ఆ మధ్య హరీష్ రావు ని దూరం పెట్టాలని కెసిఆర్ చూసారు. కానీ హరీష్ రావు నాటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ని కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చోడానికి చూసారు. దాంతో కంగుతిన్న కెసిఆర్ వెంటనే తగ్గి హరీష్ రావు చేయి జారకుండా ఒడిసి పట్టుకున్నారు.

అయితే ఇప్పుడున్న పరిస్తితిలో కెసిఆర్ చాలా తెలివిగా హరీష్ రావు ని జాతీయ రాజకీయాల్లోకి తీసుకుని వెళ్ళాలని చూస్తున్నారు. కానీ హరీష్ రావుకు అది ఏ మాత్రం ఇష్టం లేదు. లోగడ ఎంపి టికెట్ ఇచ్చినా హరీష్ రావు తిరస్కరించారు. సిఎం కావాలన్నది హరీష్ రావు కల. అయితే కెటిఆర్ తెలంగాణాలో ఉండగా అది నెరవేరేలా లేదు. అటు కెటిఆర్ కి, ఇటు  హరీష్ రావు కూడా సిఎం పదవి మీద కన్ను ఎప్పటినుంచో ఉంది. 80 శాతం అవకాశాలు కెటిఆర్ వైపే ఉన్నాయి. అది హరీష్ రావు కు మింగుడు పడడం లేదు.

అందుకే టిఆర్ఎస్ పేరుతో మరో కొత్త పార్టీ పెట్టి కెసిఆర్ కి ముచ్చెమటలు పట్టించే ఆలోచన హరీష్ రావు ఉండవచ్చు అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. అందుకే ‘వెలమ’ వర్గానికి చెందిన నాయకులతో, కెసిఆర్, కెటిఆర్ అంటే పడని వాళ్లతో ‘టిఆర్ఎస్ కొత్త పార్టీ’ పెడుతున్నట్లు సన్నాహాలు జరుగుతున్నాయి. లేదా కెసిఆర్ ని భయపెట్టాలనే యోచన కూడా కావచ్చు.

ఇదే గనక జరిగే తెలంగాణాలో బిఆర్ఎస్ పార్టీ ఓట్లు చీలిపోతాయి. ‘టిఆర్ఎస్ కొత్త పార్టీ’ గెలవకపోయినా కాంగ్రెస్ లేదా బిజెపి గెలిచేందుకు దోహదపడుతుంది. ఆ మాటకొస్తే ‘టిఆర్ఎస్ కొత్త పార్టీ’ వెనక కవిత హస్తం ఉన్నా ఆశ్చర్యం లేదు. చూడాలి, ఏం జరుగుతుందో.

Exit mobile version