Site icon Polytricks.in

మగబిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక – ఎక్కడంటే..?

తొమ్మిదో తరగతి చదువుతోన్న 14ఏళ్ల బాలిక ప్రసవించిన దారుణ ఘటన ఏపీలో చోటుచేసుకుంది. ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

14ఏళ్ల బాలిక కడప జిల్లా వాల్మీకిపురంలోని గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. శనివారం సాయంత్రం ఉన్నట్టుండి బాలిక కడుపునొప్పి అంటూ విలవిల్లాడింది. దీంతో వెంటనే పాఠశాల సిబ్బంది బాలికను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్ళారు.

మొదట ఫుడ్ పాయిజన్ అనుకున్నారు పాఠశాల సిబ్బంది. కాని ఆసుపత్రిలో వైద్యులు బాలికకు పరీక్షలు చేసిన అనంతరం గర్భవతిగా తేల్చారు. ఆ తరువాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

విషయం తెలుసుకున్న స్థానిక తాహశీల్దారు ఫిరోజ్ ఖాన్, ఎస్ఐ బిందుమాధవిలు వెంటనే ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం కోసం బాలికను, బిడ్డను తిరుపతి ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. మరోవైపు ఆ బాలిక గర్భందాల్చడానికి బాలిక మేనమామే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version