Site icon Polytricks.in

నవీన్ ని చంపిన హరిహరకృష్ణ ప్రేయసి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు? కొత్త ట్విస్ట్?

తన ప్రాణ మిత్రుడు నవీన్ నీ చంపిన నేరంలో చర్లపల్లి జైలులో రిమైండ్ ఖైదీగా ఉన్నాడు నిందితుడు హరిహరకృష్ణ కేసు ఇప్పుడు  కొత్త మలుపు తీసుకోనుంది. అతను, అతని ప్రాణ మిత్రుడు నవీన్, ఓ మమ్మాయి చుట్టూ తిరిగిన ట్రై ఆంగిల్ లవ్ స్టొరీ చివరికి ఓ నిండు ప్రాణాన్ని  బలిగొంది. అంటే ఇలాంటి  ట్రై ఆంగిల్ లవ్ స్టొరీ కేసులు జరగడం  మొదటిసారి కాదు. లోగడ ఎన్నో జరిగాయి. కానీ ప్రాణ మిత్రుడుని చంపుకునే స్టాయివరకు పోలేదు. పైగా నవీన్ని చంపిన పశ్చాతాపం, బాధ హరిహరకృష్ణలో ఏ కోశానా కనిపించడం లేదని పోలిసుల కథనం బట్టి తెలిసింది. అలాగని హరిహరకృష్ణ ప్రోఫిషనల్ కిల్లర్ కూడా కాదు. కిరాయిగుండా అంతకంటే కాదు. చదువుకునే విద్యార్ధి.

ఒక్కసారిగా అతను అలా నరరూప రాక్షసుడిగా ఎలా మారాడు? ఎందుకు మారాడు? అందులో ఆ యువతి పాత్ర ఏమైననా ఉందా? అసలు ఆ అమ్మయి ముందుగా నవీన్ని ప్రేమించింది? బాగానే ఉంది. మరి అతనిని అంత తేలికగా ఎలా మరిచిపోయినిది? రెండో దఫాలో హరిహరకృష్ణను కూడా ఎలా ప్రేమించ గలిగింది? ఒకవేళ ప్రేమించినా ఆ ఇద్దరు మిత్రుల మధ్య గొడవలు జరుగుతుంటే ఆమె ఎందుకు మౌనంగా ఉన్నది? లేక నవీన్ని చంపమని ఆమెనే హరిహరకృష్ణను ఉసిగోల్పిందా? అనే కోణంలో ఆమెను కూడా విచారించే దిశలో పోలీసులు కేసు తాయారు చేస్తున్నట్లు తెలిసింది.

హరిహరకృష్ణను చర్లపల్లి జైలునుంచి సరూర్‌నగర్ సీసీఎస్ ఆఫీస్‌‌కు నిన్న తీసుకెళ్లారు. నిందితుడు పారిపోకుండా కాళ్లకు బేడీలు వేసి విచారణకు తీసుకురావడం అందరిని కలవరపరిచింది. పొతే హరిహరలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించడం లేదు సరికదా చాలా సంతోషంగా, చలాకీగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని ప్రవర్తన అందరిని విస్మయానికి గురి చేసింది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని పోలీసులు ఏడు రోజులపాటు ప్రశ్నించనున్నారు. సామాన్యంగా పోలీసులు తమ పద్దతిలో థర్డ్ డిగ్రిలో ఇంటరాగేషన్ చేస్తారు. కాబట్టి చాలా నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నవీన్ హత్య కేసులో వెలుగు చూసిన విషయాలు మాత్రమే కాకుండా ఇంకాకొన్ని రహస్యాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

ముఖ్యంగా హరిహరకృష్ణకు కొందరు మిత్రులు కూడా సహకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య చేసిన నిందితుడికి నేరుగా ఓ మిత్రుడి ఇంట్లో తల దాచుకున్నాడు. ఓ స్నేహితుడితో ఫోన్ లో డ్రగ్స్, గంజాయి గురించి అడిగినట్లు తెలిసింది.

హత్య గురించి తెలుసుకున్న హరిహరకృష్ణ తండ్రి భయపడి వెంటనే పోలీసులకు లొంగిపొమ్మని హితవు  చెప్పినా అతను వినలేదు. తర్వార నిందితుడు వారం రోజులు తప్పించుకుని తిరిగాడు. ఆ వారం రోజులు ఏం చేశాడు? ఎవరెవరిని కలిశాడు? అనే విషయాలపై పోలీసులు గురిపెట్టారు.

అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఎన్నో విషయాలు వెలుగుచూస్తాయని భావించిన పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్ కీలకం కానుంది. హత్యలో స్నేహితుల పాత్ర, ట్రయాగింల్ లవ్ స్టోరీలో యువతి పాత్రపై కూడా పోలీసులు ఆరా తీసేందుకు స్కెచ్ గీస్తున్నారు. హరిహరకృష్ణతో పాటు అతడి ప్రేయసిని, ఇతర స్నేహితులను కూడా ఏకకాలంలో, విడివిడిగా విచారించే అవకాశాలున్నాయి.

Also Read : ప్రీతి కేసు – సంఘటన స్థలంలో ఆ వస్తువులు ఎందుకున్నట్లు..?

Exit mobile version