Site icon Polytricks.in

సానా సతీష్ బాబు దార్శనికత

ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తు కోసం తపిస్తుంటారు. కానీ కొందరు మాత్రమే తమ భవిష్యత్తును నిర్మించుకుంటారు. కానీ ఇంకొందరు మాత్రం సమాజ భవిష్యత్తును నిర్మిస్తారు. సంఘ నిర్మాతలుగా మారి ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తారు. అలాంటి సామాజికవేత్త, సంఘ సంస్కర్తనే సానా సతీష్ బాబు. ఆయన జీవితంలో నేర్చుకున్న అనుభవ పాఠాలు సానా సతీష్ బాబును శక్తివంతంగా తీర్చిదిద్దాయి. ముందు చూపును మరింత స్పష్టపరచాయి. ఉద్యోగ విరమణ అనంతరం వ్యాపార రంగంలోకి అడుపెట్టిన సానా సతీష్ బాబుకు అడుగడుగునా ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. ఎదురుదెబ్బలు తగిలాయి. కష్ట నష్టాలు వచ్చాయి. కానీ అవేవి కూడా సానా సతీష్ బాబు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదు. అంతకు మించి భవిష్యత్తు నిర్మాణం పట్ల మరింత స్పష్టతను ఇచ్చాయి. అనుభవ పాఠాలే సానా సతీష్ బాబు వ్యాపార సామ్రాజ్య నిర్మాణానికి బలమైన పునాదులయ్యాయి. సానా సతీష్ బాబు దార్శనికతను పారదర్శకం చేశాయి. అందుకే సానా సతీష్ బాబు ప్రతి ఆలోచన తాత్కాలిక ప్రయోజనాల కంటే కూడా భవిష్యత్తును విచారించి చేసేవే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రజలకు ప్రగతివంతమైన జీవనాన్ని అందించాలంటే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యూహాలు అమలు చేయాలి.

 

సానా సతీష్ బాబు ధ్యాస ఎప్పుడూ ఒక్కటే తానొక్కడే నిలబడితే నలుగురికి మేలు జరుగుతుంది. కానీ తనలాంటి వారు వేలల్లో, లక్షల్లో తయారైతే ఒక సమాజమే బలపడుతుంది. ఆ ప్రాంతం ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది. అందుకే ఔత్సాహిక వ్యాపారవేత్తలకు వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సహిస్తున్నారు సానా సతీష్ బాబు. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉపాధి, నైపుణ్య శిక్షణను అందించడమే కాకుండా వారికి ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను తన విస్తారమైన పరిచయాల ద్వారా కల్పిస్తున్నారు. తద్వారా కుటుంబాలను బలపరుస్తున్నారు. కుటుంబాలు ఆర్థికంగా బలపడితే సామాజికంగా నిలదొక్కుకుంటాయి. తద్వారా సమాజంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందనే దూరదృష్టి సానా సతీష్ బాబుది. అంతేకాదు ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే తాము సాధించిన ప్రగతి ఫలాలను సాధించగలరు. అందుకే వారి ఆరోగ్య పరిరక్షణకు కూడా సానా సతీష్ బాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో పనులను భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేస్తూ దార్శనికుడవయ్యా సతీష్ బాబు అనిపించుకుంటూ ప్రజల మనన్నలను పొందుతున్నారు.

 

Exit mobile version