Site icon Polytricks.in

వెలుగులోకి వచ్చిన నిత్యానంద మరో ప్రియురాలు ‘విజయప్రియ’?

నిత్యానంద స్వామి రాసలీలల గురించి అందరికి తెలుసు. రేప్‌ కేసులల్లో, కిడ్నాప్‌ కేసుల్లో నిందితుడిగామారి దేశం వదిలి పారిపోయిన ఈ దొంగ స్వామిజి తన మరో ప్రియురాలిని ప్రపంచానికి ప్రయిచయం చేశాడు. ఆమె పేరు విజయప్రియ నిత్యానంద. ఆమెను అందరికి తెలివిగా పరిచయం చేస్తూ మరో స్కాం కు తెర లేపాడు. ఇప్పటికే అతను ‘యునైటెడ్ స్టేట్ ఆఫ్ కైలాస’ అనే ఓ దేశాన్ని నిర్మించినట్లు కోతలు కోశాడు. అలాంటి దేశం లేదని పోలీసులు తేల్చి చెప్పారు.

ఇప్పుడు మరోసారి అందరి చెవిలో పువ్వు పెట్టాడు. ఐక్యరాజ్యసమితి ఫిబ్రవరి 24న జెనీవాలో జరిగిన 19వ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల సదస్సులో కైలాస దేశం ప్రతినిధిగా ‘విజయప్రియ నిత్యానంద’ పాల్గొన్నది అని ట్విట్టర్ లో సంచలన లేపాడు. ఫిబ్రవరి 24న జరిగిన సుస్థిర అభివృద్ధి చర్చలో ఆమె ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ నుంచి ప్రసంగిచింది అని ప్రకటించాడు. ఆమెతో పాటు మరో వ్యక్తీ కూడా ప్రసంగించాడు అని వివరించాడు. కానీ అతని వివరాలు వెల్లడించలేదు. మన హిందూ సనాతన సంప్రదాయాలను ప్రపంచానికి చాటడం తన విధిగా చెప్పాడు.

ఆమె కాషాయం బట్టలు ధరించి, నుదుటిపై పెద్ద బొట్టు పెట్టి, మెడలో రుద్రాక్ష జపమాల ధరించి ఆంగ్లంలో అనర్గళంగా ప్రసంగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో పెట్టాడు. దీని మీద పోలీసులు విచారణ జరిపారు. అయితే ‘కైలాస దేశం’ తమ లిస్టు లో లేదని, ఆ దేశం ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి లో పాల్గొనలేదని తేల్చి చెప్పారు సంభదిత అధికారులు. ఏదో విధంగా పబ్లిసిటీ లో నానాలి అనుకునే ఇలాంటి వాళ్ళను జనం ఎలా నమ్ముతారు?

Exit mobile version