Site icon Polytricks.in

ఆర్ఆర్ఆర్ సినిమా తీసింది ప్రధాని మోడీ నా? మరి రాజమౌళి పేరు ఎందుకు వేసుకున్నాడు?

అవును. మీరు చదివింది అక్షరాలా నిజమే. ఆర్ఆర్ఆర్ సినిమాకు కథ, మాటలు రాసి, దర్శకత్వం వహించింది అక్షరాలా ప్రధాని నరేంద్ర సింగ్ మోడీ. ఆ సినిమా లోని ‘నాటు నాటు’ పాట రాసింది బోస్ కాదు. నరేంద్ర సింగ్ మోడీ. అసలు ఆ సినిమాకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడానికి కారణం కూడా మోడీ నే.

నిజమా? మరి ఆర్ ఆర్ఆర్ సినిమాకు దర్శకుడి గా రాజమౌళి తన పేరు ఎందుకు వేసుకున్నారు? ‘నాటు నాటు’ పాటను తాను రాశానని చంద్ర బోస్ ఎందుకు అబద్దం చెప్పారు? ఎంత మోసం?

ఈ మాటలు చెప్పింది ఎల్లిగాడో, మల్లిగాడో, సుబ్బిగాడో కాదు. ఆలిండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్, రాజ్యసభలో విపక్షనేతగా వ్యవహరిస్తున్న మల్లికార్జున ఖర్గే స్వయంగా చెప్పారు. ఎక్కడో ఇరాని హోటల్లో చాయి తాగుతూ చెప్పిన సొల్లు మాటలు కావు. స్వయంగా పార్లమెంట్లో 552 మంది పార్లమెంట్ సభ్యుల సమక్షంలో బల్ల గుడ్డి మరీ చెప్పారు.

అవును. పార్లమెంట్లో ప్రతి మాట రికార్డ్ అవుతుండగా ఆయన సీరియస్ గా చెప్పారు. దీనిని విని పార్లమెంట్ ఖంగారు పడలేదు. అందరు గొల్లున నవ్వారు. స్పీకర్ నవ్వ లేక చచ్చారు. ఆ మాటలు విని బిజెపి నేతలు కడుపుబ్బా నవ్వారు.

అది ఎలాగంటే, నిన్న పార్లమెంట్ సమావేశాల్లో అన్ని పార్టీల నాయకులు మన దేశానిని ఒకేసారి రెండు ఆస్కార్ అవార్డు లు రావడం పట్ల ముక్తకంఠం తో ప్రశంసల జల్లు కురిపించారు. అందులో ఆర్ఆర్ఆర్తో పాటు  ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఉన్నాయి.

అందరితో పాటు ఆలిండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్, రాజ్యసభలో విపక్షనేతగా వ్యవహరిస్తున్న మల్లికార్జున ఖర్గే కూడా ఆర్ఆర్ఆర్ సినిమాను మెచ్చుకుని చివర్లో గొప్ప ఫింషింగ్ టచ్ ఇచ్చారు.

దేశం ఏ గొప్పపని చేసినా మోడీ తన ఖాతాలో వేసుకుంటారు. అదే క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమాకు కథ, మాటలు రాసి, దర్శకత్వం వహించింది నేను అని ప్రదాని మోడీ చెప్పుకోవద్దు అని కోరారు. అలాగే ఆ సినిమా లోని ‘నాటు నాటు’ పాట రాసింది నేనే, అసలు ఆ సినిమాకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడానికి కారణం కూడా నేనే అని మోడీ చెప్పుకోవద్దు, ప్లీజ్” అని సున్నితంగా చురకలు అంటించారు.

మోడీ స్వభావం తెలిసి అందరు ఒక్కసారిగా గొల్లున నవ్వారు. అయితే స్పీకర్ ఈ మాటలను పార్లమెంట్ రికార్డ్స్ లోంచి తొలగించకపోవడం గొప్ప కొసమెరుపు.

మరో ట్విస్ట్ 

నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో అన్ని పార్టీల నాయకులు ఆర్ఆర్ఆర్ సినిమాను పొగడ్తలతో ముంచెత్తారు. ఇందులో ఒక లేడి ఎం పి మాట్లాడుతూ ”నాటు నాటు’ అనే పదాలు నటరాజు నాట్యంలో నుంచి పుట్టాయి” అని కొత్త నిర్వచనం చెప్పి అందరికి షాక్ ఇచ్చారు. లోగడ ఆమె నాట్యం చేసేది. అసలు ఆమెకు తెలుగు వచ్చి ఉంటే ‘నాటు నాటు అర్థం తెలిసేది. పాపం!

Exit mobile version